నిబంధనల మేరకే టపాసులకు అనుమతి

కడప,నవంబర్‌13(జ‌నంసాక్షి): కరోనా నిబంధనలను పాటించకుండా దీపావళి పండుగ రోజు టపాసులు కాలిస్తే చర్యలు తీసుకుంటామని కడప పోలీసులు హెచ్చరించారు. బాణాసంచా కాల్చవద్దన ఉత్తర్వులు ఉన్నాయని అన్నారు. టపాసుల పొగ ఊపిరి తిత్తుల విూద పడి మరణించే అవకాశం కరోనా రోగులకు ఎక్కువగా ఉంటుందన్నారు. కావున టపాసులు కాల్చే వాళ్లు తప్పక నిబంధనలు పాటించాలన్నారు. రాత్రి 8 - 10గంటల మధ్య మాత్రమే పొగ వెదజల్లని టపాసులు కాల్చుకోవాలన్నారు. టపాసులు కొనేవారు, కాల్చేవారు భౌతికదూరం పాటిస్తూ మాస్కులు ధరించాలన్నారు.