పనిచేసే ప్రభుత్వాన్నే ఆదరించండి


నగరంలో విస్తృంతంగా పర్యటించిన కెటిఆర్‌


అర్హులందరికి త్వరలోనే డబుల్‌ ఇళ్లు అందచేస్తాం


పలు ప్రారంభోత్సవాలతో ప్రజల ముందుకు మంత్రి


హైదరాబాద్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): రాష్ట్రంలో పని చేసే ప్రభుత్వాన్ని ఆదరించాలని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నగరాభివృద్దికి అనేక కార్యక్రమాలను చేపట్టామని అన్నారు. ఆలస్యమైనా అందరికీ డబుల్‌ ఇళ్లను అందచేస్తామన్నారు. శుక్రవారం ఉదయం సనత్‌నగర్‌ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్‌, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులతోపాటు నిర్మాణం పూర్తి చేసుకున్న భవనాలను ప్రారంభించారు.


తెలంగాణను భారతదేశంలోనే అగశ్రేణి రాష్ట్రంగా నిలపాలనే ఉద్దేశంతో సీఎం పని చేస్తున్నారు. రాష్ట్రం రెవెన్యూను పెంచాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని ఉద్ఘాటించారు. పేదలకు సంక్షేమ కార్యక్రమాల రూపంలో ఆ ఆదాయాన్ని అందించాలన్నదే సీఎం ఉద్దేశం అని కేటీఆర్‌ తెలిపారు. పేదలకు, మధ్యతరగతి వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది. కరోనా వైరస్‌, వరదల సమయంలో ప్రజలను ఆదుకున్నామని స్పష్టం చేశారు. అర్హులైన పేదలకు తప్పకుండా డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను పంపిణీ చేస్తామన్నారు. పేదవారికి స్థలాలు ఉండి పట్టాలు రాని వారు ఉన్నారు. గతంలో జీవో నం. 58, 59 కింద కొంతమందికి ఇచ్చాం. మిగతా సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఉదయం 10 గం.లకు సనత్‌నగర్‌లోని బల్కంపేట్‌లో రూ. 3.60కోట్లతో నిర్మించిన వైకుంఠధామాన్ని కేటీఆర్‌ ప్రారంభించారు. ఫతేనగర్‌ ఫ్లై ఓవర్‌ సవిూపంలో 2.45 ఎకరాల విస్తీర్ణంలో వైకుంఠధామం నిర్మించారు. శ్మశానవాటిక ప్రవేశమార్గాన్ని జీహెచ్‌ఎంసీ ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణం సనత్‌ నగర్‌ నియోజకవర్గం నుంచే చేపట్టాం. ఆదర్శవంతంగా ఇండ్లను నిర్మించాం. సనత్‌నగర్‌లో వైకుంఠధామం, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌, లింక్‌ రోడ్లను నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించాలని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఆ విధంగా సనత్‌ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుంటున్నామని తెలిపారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలకు ఉపయోగపడే విధంగా పనులు చేస్తున్నాం. కరెంట్‌ సమస్య లేదు. తాగునీటి కష్టాలు లేవు. రోడ్లను అభివృద్ధి చేసుకుంటున్నాం. హైదరాబాద్‌లో సనత్‌ నగర్‌ నియోజకవర్గం అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. పర్యటనలో భాగంగా మారేడ్‌పల్లిలో రూ. 3 కోట్లతో నిర్మించిన మల్టీపర్పస్‌ ఫంక్షన్‌ హాల్‌ను ప్రారంభించారు. అంతకంటే ముందు ఆదయ్యనగర్‌లో రూ. 3 కోట్లతో నిర్మించిన అధునాతన లైబ్రరీని ప్రారంభించారు. సనత్‌ నగర్‌ నియోజక వర్గంలో రూ. 5కోట్లతో నిర్మించిన స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌కు కూడా మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో రెండు బ్యాడ్మింటన్‌ కోర్టులు, లేడీస్‌ జిమ్‌, యోగా హాల్‌, స్నూకర్‌ రూమ్‌, క్యారమ్స్‌, జెంట్స్‌ జిమ్‌, టేబుల్‌ టెన్నిస్‌ ఆడుకునేందుకు సదుపాయాలను కల్పించారు. సనత్‌ నగర్‌ నెహ్రూ పార్కులో థీమ్‌ పార్క్‌ నిర్మాణానికి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. తెలంగాణను భారతదేశంలోనే అగశ్రేణి రాష్ట్రంగా నిలపాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పని చేస్తున్నారు అని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో రెండు బ్యాడ్మింటన్‌ కోర్టులు, లేడీస్‌ జిమ్‌, యోగా హాల్‌, స్నూకర్‌ రూమ్‌, క్యారమ్స్‌, జెంట్స్‌ జిమ్‌, టేబుల్‌ టెన్నిస్‌ ఆడుకునేందుకు సదుపాయాలను కల్పించారు. సనత్‌ నగర్‌ నెహ్రూ పార్కులో థీమ్‌ పార్క్‌ నిర్మాణానికి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. అంతకు ముందు బల్కంపేటలో రూ. 3.60 కోట్లతో నిర్మించిన వైకుంఠధామాన్ని ప్రారంభించారు. స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ ప్రారంభం సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్‌ ప్రసంగించారు. ప్రజల కష్టాలు, అవసరాలు తెలుసుకుని వాటిని తీర్చే వారే అసలైన నాయకులు అని కేటీఆర్‌ అన్నారు. తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో సనత్‌ నగర్‌ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతోంది అని స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పడ్డ సమయంలో అనేక అనుమానాలు ఉండేవి. అప్పుడు కరెంట్‌ ఉంటే వార్త.. నాడు నీళ్లు వస్తే వార్త. అప్పుడు సుస్తీ ఎక్కడికి పోవాలో తెలియని పరిస్థితి. కానీ తెలంగాణ ప్రభుత్వంలో అలాంటి సమస్యలు లేవు. 24 గంటలు నాణ్యమైన విద్యుత్‌ను ఇస్తున్నాం. ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తున్నాం. పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసుకున్నాం.. ఇలా హైదరాబాద్‌లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. మంత్రి వెంట తలసాని, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తదితరులు ఉన్నారు.