గాలిలోనే కలసిపోతున్న జగన్‌ హావిూలు: నిమ్మల

ఏలూరు,నవంబర్‌29 (జనం సాక్షి):  ముఖ్యమంత్రి జగన్‌ గాలిలో ఇస్తున్న హావిూలు.. గాలిలోనే కలిసిపోతున్నాయని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు. హావిూల అమలులో చిత్తవుద్ది కానరావడం లేదన్నారు. పాలకొల్లు మండలంలో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆదివారం పర్యటించారు. ఆగర్రు, ఆగర్తిపాలెం, వెలివెలలో నివర్‌ తుపాన్‌ ప్రభావం వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విూడియాతో మాట్లాడుతూ  రైతులను ఆదుకోవడంలో నిర్లక్ష్యంపై.. అసెంబ్లీలో చర్చకు పట్టుబడతామన్నారు. ప్రభుత్వం రైతులకు ఒక్క సాయం కూడా చేయలేదని ఆరోపించారు. అన్నదాతకు ఇచ్చే సాయం తక్కువ...సొంత అవినీతి విూడియాకు ఇచ్చే ప్రకటనల ఖర్చు ఎక్కువని నిమ్మల రామానాయుడు ఎద్దేవా చేశారు.