వివరాలు వెల్లడించిన సైబరాబాద్ కమిషనర్
హైదరాబాద్,నవంబర్13(జనంసాక్షి): రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో బైక్స్ అపహరిస్తున్న ముఠాను అరెస్ట్ చేశామని సీపీ సజ్జనార్ తెలిపారు. ఆరుగురు దొంగలను అరెస్ట్ చేశామని, నిందితుల వద్ద నుంచి 30 బైక్స్ స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. అపహరించిన బైక్‌లను నాందేడ్‌లకు రూ.15వేల నుంచి 30వేలకు విక్రయిస్తున్నట్లు ఆయన తెలిపారు. చెడు అలవాట్లకు బానిసై బైక్స్ అపహరిస్తున్నారని పేర్కొన్నారు. నిందితులు రాజేంద్రనగర్ యెన్నంగూడ బస్తీ వాసులుగా గుర్తించామన్నారు. గతంలో హైదర్‌గూడ ఎస్‌బీఐ ఏటీఎంలో చోరీకి ముఠా యత్నించిందని సజ్జనార్ తెలిపారు. ఏడుగురు సభ్యుల ముఠాను నగరంలోని సైబరాబాద్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ విూడియా ద్వారా వివరాలను వెల్లడించారు. ముఠా సభ్యులు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైకులను దొంగిలిస్తున్నారన్నారు. ముఠా ప్రధాన సూత్రధారి రాజ్‌కుమార్ అన్నారు. ముఠాలో నలుగురు బాల నేరస్థులు ఉన్నట్లు వీరిని జువైనల్ ¬ంకు తరలించినట్లు తెలిపారు. చెడు అలవాట్లు, జల్సాలకు బానిసలై ముఠా సభ్యులు చోరీలు చేస్తున్నట్లుగా వెల్లడించారు. చోరీ చేసిన బైక్‌లను నాందేడ్‌లో అమ్మేవారన్నారు. ముఠా నుంచి 30 బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ పేర్కొన్నారు.