<no title>


రోడ్లు, డ్రైనేజీ సమస్యలపైనే  ప్రధానంగా చర్చ
ఓటర్లను ప్రభావితం చేసే అవకాశాలు ఎక్కువ
నగరం దాటిని ఓటర్లను రప్పించే పనిలో అభ్యర్థులు
హైదరాబాద్‌,నవంబర్‌30 (జనం సాక్షి):  గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలకు అంతా సిద్దమైన వేళ ప్రజలు దేనికి స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది. ప్రధానంగా గుంతల రోడ్లు, ట్రాఫిక్‌ చిక్కులు, డ్రైనేజీ వ్యవస్థ 
అస్తవ్యస్థం కావడంపై ప్రజలు ప్రభావితం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ సమస్యలపై ప్రదానంగా చర్చ సాగుతోంది. మాములు రోజుల్లో అందంగా కనిపించే సిటీ వర్షాలొస్తే  భయపెడుతుంది. పలు కాలనీల్లో కుక్కల బెడద కూడా చాలా ఎక్కువ. ఎన్నిసార్లు బల్దియా అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. వీటికి తోడు కోతులు కూడా ఇళ్లలోక్‌ఇ చేరి ప్రజలను బయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. డ్రైనేజీ వల్ల సమస్యల చెప్పినా  నాయకులు వచ్చింది చూసింది లేదు. స్థానిక కార్పొరేటర్‌, 
ఎమ్మెల్యే ఎవరూ రారు, పట్టించుకోరు. సిటీలో ఉంటున్న వారిలో వివిధ రాష్ట్రాలకు చెందిన వారు కూడా  ఎక్కువే. వివిధ ఉద్యోగాలు, వృత్తుల కోసం ఇక్కడే స్థిరపడ్డారు. ఎన్నో ఏళ్ల క్రితం ఇక్కడకు వచ్చారు.  ఓటర్‌, ఆధార్‌ అన్ని ఉండి హైదరాబాదీలు అయిపోయారు. వవీరంతా కరోనా టైంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పారు. ఇకపోతే ప్రజలు చాలాచోట్ల ప్రధానంగా ఇరుకు రోడ్లు, గుంతలు, మ్యాన్‌ ¬ల్స్‌ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడ మ్యాన్‌ ¬ల్‌ ఉందో, గుంత ఉందో తెలియక వానాకాలంలో సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు. ఇక వర్షాలప్పుడే కాకుండా మాములు రోజుల్లో కూడా డ్రైనేజీ సమస్య ఎక్కువగా ఉంటుందన్నారు. ట్రాఫిక్‌, పొల్యూషన్‌,గుంతల  రోడ్లు ఇవే ప్రధాన సమస్యలుగా పలుప్రాంతాల ప్రజలు ప్రస్తావిస్తున్నారు.ఈ ఎన్నికల్లో ఈ సమస్యు ప్రధానంగా ప్రబావితం చూసే అంశాలుగా చూడవచ్చు. ఇక  గ్రేటర్‌ ఎన్నికల ఘట్టం తుదిదశకు చేరుకున్న దశలో సెలవుల కారనంగా కొందు నగరం దాటితే..నగరం విడిచి వెళ్లిన కొందరు హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. కరోనా ప్రభావంతో ఊరెళ్లిన కొందరు నగర ఓటర్లు అక్కడే ఉండిపోయారు. వరుస సెలవులు, శుభకా ర్యాల నేపథ్యంలో మరికొందరు ఊరిబాట పట్టారు. వీరందరినీ తిరిగి రప్పించేందుకు అభ్యర్థులు నానా పాట్లు పడుతున్నారు. ఇందుకోసం ఊరెళ్లిన నగర ఓటర్లను రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.  పనులు, శుభకార్యాల నిమిత్తం సొంతూళ్లు, ఇతర ప్రాంతాలకు వెళ్లిన  ఓటర్లను పోలింగ్‌ రోజు వచ్చి ఓటు వేయాలని రావాలని అభ్యర్థులు ప్రాథేయపడుతున్నారు. రవాణా చార్జీలకు డబ్బులు కూడా చెల్లిస్తున్నారు. పార్టీల నడుమ పోటీ తీవ్రంగా ఉండడంతో ప్రతి ఓటును విలువైనదిగా చూస్తున్నారు. ఇలా చాలా డివిజన్లలో ఇలాంటి పరిస్థితే నెలకొంది.