విూడియా అకాడవిూ కార్యదర్శిగా ముర్తుజా


హైదరాబాద్‌,నవంబర్‌11((జనంసాక్షి)): తెలంగాణ రాష్ట్ర విూడియా అకాడవిూ కార్యదర్శిగా మహ్మద్‌ ముర్తుజా బాధ్యతలు స్వీకరించారు. మహ్మద్‌ ముర్తుగా 1993లో సహాయ పౌరసంబంధాల అధికారిగా సమాచారశాఖలో నియమితులయ్యారు. 28 ఏళ్లుగా సమాచార శాఖలో వివిధ ¬దాల్లో పనిచేశారు. వరంగల్‌ అర్బన్‌జిల్లాలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ముర్తుజాకు సంయుక్త సంచాలకులుగా నియమిస్తూ సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్‌ అర్వింద్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం విూడియా అకాడవిూ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న డిఎస్‌ జగన్‌ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా ముర్తుజా మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమాల నిర్వహణకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.