ప్రేమపేరుతో యువతులకు వల


డబ్బుల కోసం పెళ్లిళ్ల పేరుతో డబ్బులు కాజేసే దందా
భార్య ఫిర్యాదుతో బట్టబయలైన యువకుడి బాగోతం
హైదరాబాద్‌,డిసెంబర్‌5 (జ‌నంసాక్షి) :   ప్రేమ పేరుతో యువతులను మోసం చేస్తున్న ఓ వివాహితుడి లీలలు బయటపడ్డాయి. చందానగర్‌ ఆర్టీసీ కాలనీకి చెందిన కుర్ర విజయ్‌ భాస్కర్‌పై కట్టుకున్న భార్య సౌజన్య ఫిర్యాదుతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. బందువుల సంబంధం కావడంతో ఉద్యోగం లేకపోయినా విజయ్‌ భాస్కర్‌కు భారీగా కట్నకానుకలు సమర్పించి ఒంగోలుకు చెందిన సౌజన్య వివాహం చేసుకుంది. అనంతరం విజయ్‌ భాస్కర్‌ కుటుంబ సభ్యులు అంతా కలిసి అదనపు కట్నానికి ఆశపడి అతనికి మరో వివాహం చేసేందుకు పథకం పన్నారు. అందులో భాగంగా సౌజన్యను అత్తింటివారు, భర్త వేధింపులకు గురిచేశారు. విజయ్‌ భాస్కర్‌ పెళ్ళై మూడేళ్ల బాబు ఉన్నా కూడా చాలా మంది యువతులతో పరిచయం పెంచుకుని వారి వద్ద నుండి డబ్బులు కాజేయడం వృత్తిగా మలుచుకున్నాడు. ఫేస్‌బుక్‌లో అందంగా కనిపించే ఆంధ్రా అమ్మాయిలు, సాప్ట్‌వేర్‌ ఉద్యోగినులే అతను టా/-గ్గం/ట్‌గా పెట్టుకున్నాడు. ఇప్పటికి పదులకు పైగా అమ్మాయిలను మోసం చేసినట్లు విజయ్‌పై ఆరోపణలు ఉన్నాయి. భార్య ఉండగానే మరో యువతులతో చాటింగ్‌లు చేస్తూ వారితో ప్రేమాయాణాలు జరిపేవాడు. వారికి హిస్కోలో ఉద్యోగిగా నమ్మిస్తూ బ్యాచిలర్‌నని నమ్మించి బుట్టలో వేసుకునేవాడు. ఇలా బుట్టలో పడిన ఒక యువతి విజయ్‌ భాస్కర్‌ను పెళ్లి చేసుకుందామని అతని బ్యాక్‌గ్రౌండ్‌ కనుక్కోగా తతంగం మొత్తం బయటపడింది. విజయభాస్కర్‌కు అప్పటికే వివాహమై కొడుకు కూడా ఉన్నట్లు తెలుసుకుని మోసాపోయానని గ్రహించింది. తన దగ్గర విజయ్‌ భాస్కర్‌ చేసిన మోసాలకు సంబంధించిన సాక్షాలను వెలుగులోకి తీసుకువచ్చింది. పెద్దమనుషుల సమక్షంలో కాళ్లు కూడా మొక్కించారు. అయితే ఇప్పుడు విజయ్‌ భాస్కర్‌ చేతిలో భార్య సౌజన్య బలైపోయిందని తనకి న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తోంది. లక్షల్లో కట్నకానుకలు తీసుకుని తనని, తన బాబుని నడీరోడ్డు విూద నిలబెట్టాడని రోదిస్తోంది. విజయ్‌ భాస్కర్‌పై ఇప్పటికే ప్రకాశం జిల్లా ఒంగోలు మహిళా పోలీసుస్టేషన్‌లో భార్య సౌజన్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా విజయ్‌ భాస్కర్‌ను ప్రశ్నించడానికి వెళ్లిన సమయంలో భార్య సౌజన్యను విజయ్‌ భాస్కర్‌, అతని తల్లిదండ్రులు దాడి చేశారని మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో సైతం కేసు నమోదు చేశారు. తనకి మాత్రం న్యాయం చేయమని సౌజన్య ఆవేదన వ్యక్తం చేస్తోంది.