బిజెపికి కలసివస్తున్న కాంగ్రెస్‌ వైఫల్యం


తెలంగాణలో టిఆర్‌ఎస్‌ తీరుతోనే బిజెపికి బలం
హైదరాబాద్‌,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): ముందు మిమ్ములను విూరు కాపాడుకోండి అని సిపిఐ నేత నారాయణ కాంగ్రెస్‌ పార్టీకి ఓ టీవీ చర్చలో చురకుల అంటించారు. కాంగ్రెస్‌ వైఫల్యం కారణంగానే తెలంగాణలో బిజెపి రాకెట్‌లా దూసుకుని వస్తోంది. అధికార పార్టీ కూడా ప్రతిపక్షం అన్నది లేకుండా చేసిన పాపానికి బిజెపి గునపంలా పాతుకుపోతోంది. బిజెపిని ఎదరిస్తానని సిఎం కెసిఆర్‌ చెప్పడం చూస్తుంటే బిజెపి ఎంతగా కొరకరాని కొయ్యగా తయారయ్యిందో అర్థం చేసుకోవాలి. రాజకీయాల్లో అంతా తమకు అనుకూలమన్న విధానం సరికాదు. ఎప్పటికప్పుడు , ఏరోజుకారోజు సవిూక్షించుకోవాలి. తెలంగాణలో కాంగ్రెస్‌/-ను భూస్తాపితం చేస్తే తమకు ఎదురు లేదనుకునే కెసిఆర్‌ తీరు సరికాదని తాజా రాజకీయాలు రుజువు చేస్తున్నాయి. గ్రేటర్‌ ఎన్నికల సందర్బంగా ఇది ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ప్రజల్లో అభిమానం ఉండాలి తప్ప పోల్‌ మేనేజ్‌మెంట్‌ ఎప్పుడూ పనికిరాదని కూడా టిఆర్‌ఎస్‌ నేతలు గుర్తించాలి. దేశవ్యాప్తంగా  కాంగ్రెస్‌ పార్టీ తనను తాను ఒక బలమైన ప్రతిపక్షంగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నించ లేకపోయింది. 
సంప్రదాయ ఓట్లపైనే ఆధారపడుతూ వస్తోంది. అలాగే దానికి పట్టిన జాడ్యం వదలడం లేదు. కుటుంబపార్టీ అన్న ముద్ర నుంచి బయటపడడం లేదు. ఇక తెలంగాణ విషయానికి వస్తే గెలిచిన ఎమ్మెల్యేలు అంతా కట్టగట్టుకుని అధికార టిఆర్‌ఎస్‌లో చేరారు. పదవుల ప్రలోభాలకు వారు చిక్కుకున్నారు. ఇదే కాంగ్రెస్‌ కొంప
ముంచింది. గెలిస్తే అధికార పార్టీలో చేరుతారన్న ప్రచచారం కాంగ్రెస్‌ను వెన్నాడుతోంది. అందుకే సిపిఐ జాఈయ కార్యదర్శి నారాయణ చురకుల అంటించారు. గ్రేటర్ల్‌ఓ ఒకరిద్దరు గెలిచినా కాంగ్రెస్‌తో ఉంటారన్న భరోసా లేదు. ఎందుకంటే స్థానిక సంస్థల్లో కూడా కాంగ్రెస్‌కు ఇదే అనుభవం ఉంది. కాంగ్రెస్‌ బలహీనం కావడం వల్ల్నే బలమైన ప్రతిపక్షంగా బిజెపి దూసుకుని వచ్చింది. ఒక్క ఎమ్మెల్యే సీటుతో ఏం చేస్తారన్న నిర్లక్ష్య ధోరణి కూడా దీనికి కారణంగా చూడాలి. అన్నింటికి మించి ప్రజలను విస్మరించి, తెలంగాణ ఆకాంక్షలను తుంగలో తొక్కడం వల్ల్నే ఇవాళ బిజెపికి ప్రజల్లో బలం పెరుగుతుందని అధికార పార్టీ వారు గుర్తిస్తే మంచిది. ఈ కారణాల వల్ల ప్రస్తుతం తెలంగాణలో బిజెపిని ఎదుర్కొనే భారం పడింది.కాంగ్రెస్‌ పార్టీ దేశ సమస్యలపై ప్రేక్షక పాత్ర వహించి, ప్రజాందోళనల్లో పాల్గొనే శక్తి కోల్పోయినందువల్ల ప్రాంతీయ పార్టీలు బలఅపడుతూ వచ్చాయి. అలాగే ప్రాంతీయ పార్టీలు ఇవాళ తమ తప్పిదాల కారణంగా  తామెంత బలవంతులమో తేల్చుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాయి. బిహార్‌లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం వల్ల రాష్టీయ్ర జనతాదళ్‌ అధికారంలోకి రాలేకపోయింది. ఎపిలో   కాంగ్రెస్‌తో అంటకాగిన కారణంగా చంద్రబాబు అడ్రస్‌ లేకుండా పోయారు. మహారాష్ట్రలో శివసేన, ఎన్‌సిపి కూటమిని బలపరచాల్సిన తప్పని పరిస్థితిలో కాంగ్రెస్‌ నిర్ణయం తీసుకుంది. అయితే కాంగ్రెస్‌ లాగానే చాలా చోట్ల ప్రాంతీయ పార్టీలకు వారసులు నాయకత్వం వహిస్తున్నారు. తెలంగాణలో కెసిఆర్‌ కుమారుడు కెటిఆర్‌, కూతురు కవితలు రాజకీయ వారసులుగా ఎదిగారు. ఎపిలో జగన్‌ వారసత్వ రాజకీయాలు పుచ్చుకున్నారు. తమిళనాడులో స్టాలిన్‌ ఈ బాధ్యతలు తీసుకున్నారు. పంజాబ్‌లో అకాళీదళ్‌కు ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ కుమారుడు సుఖ్‌ బీర్‌ సింగ్‌ బాదల్‌, జార్ఖండ్‌లో శిబూ సోరేన్‌ కుమారుడు హేమంత్‌ సోరెన్‌, ఉత్తర ప్రదేశ్‌లో సమాజ్‌ వాది పార్టీకి ములాయం సింగ్‌ యాదవ్‌ కుమారుడు అఖిలేశ్‌ యాదవ్‌, బిహార్‌లో రాష్టీయ్ర జనతాదళ్‌కు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు తేజస్వి యాదవ్‌, మహారాష్ట్రలో శివసేనకు బాల్‌ థాకరే కుమారుడు ఉద్దవ్‌ థాకరే, కశ్మర్‌లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌కు ఫరూక్‌ అబ్దుల్లా కుమారుడు ఒమర్‌ అబ్దుల్లా, పీడీపీకి ముఫ్తీ మహమ్మద్‌ కుమార్తె మహబూబా ముఫ్తీ దేశంలో బిజెపిని అడ్డుకునేందుకు సమాయత్తమవుతున్నారు. వీరి దారిలో తండ్రి కేసీఆర్‌కు తోడుగా కేటీఆర్‌ బిజెపికి వ్యతిరేకంగా సైద్దాంతిక పోరులో దిగారు.  జీహెచ్‌ఎంసి ఎన్నికల్లో బిజెపిని టీఆర్‌ఎస్‌ అడ్డుకోగలిగితే మిగతా ప్రాంతీయ పార్టీల నేతలకు బలం వస్తుంది. అప్పుడు కెసిఆర్‌ తలపెట్టిన పోరుకు కూడా పునాది పడుతుంది. బిజెపిక ఇఉన్న ప్లస్‌ పాయింట్‌ అల్లా అది వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించదు. అందులో అలాంటి ఛాయలు రాకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటారు. అలాగే అనేక రకాలుగా పార్టీలో వడపోతలు కూడా ఉంటాయి. బిజెపి ఎదుగడానికి ఇది కూడా ఓ కారణంగా చూడాలి. అలా చేయడం వల్ల ప్రజల్లో కూడా పాజిటివ్‌ దృక్పథం ఏర్పడింది. ఈ కారణాలను విశ్లేషించుకుంటే తెలంగాణలో కావచ్చు..ఇతర చోట్ల కావచ్చు బిజెపిని నిలవరించడం సాధ్యమని గుర్తించాలి.