కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించండిదిల్లీ జనవరి 30 (జనంసాక్షి): టిఆర్‌ఎస్‌ పార్టీ నూతన వ్యవ సాయ చట్టాలకు వ్యతిరేకమని. అఖిలపక్ష సమావేశంలో టిఆర్‌ఎస్‌ ఎంపీ కే కేశవరావు నామా నాగేశ్వరరావు అన్నారు రైతులు పండిస్తున్న పంటలకు కనీస మద్దతు ధర భద్రత కల్పిం చాల్సిన అవసరం ఉందని వారు డిమాండ్‌ చేశారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి దేశానికే గర్వకారణమని తెరాసనేత, ఎంపీ కె.కేశవరావు అన్నారు. వ్యవసాయం, మార్కెటింగ్‌, నీట ిపారుదల, విద్యుత్‌ రంగాలకు తెరాస ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అఖిలపక్ష భేటీ అనంతరం ఎంపీ నామానాగేశ్వరరావుతో కలిసి దిల్లీలో ఆయన విూడియాతో మాట్లాడారు. అఖిలపక్ష సమావేశంలో 18 పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు. సమావేశంలో వ్యవసాయ చట్టాల అంశాన్ని పలు పార్టీల నేతలు లేవనెత్తారు. సమావేశంలో ప్రస్తావించిన అంశాలను ఎంపీలు విూడియాకు వెల్లడించారు.వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు రైతుబంధు అమలు చేస్తున్నామన్నారు.  పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా జరిగేందుకు కేంద్రానికి మద్దతిస్తామన్నారు. దిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ అనేది తెరాస విధానంకాదని స్పష్టం చేశారు. ఏం చేసినా తెలంగాణ ప్రయోజనాలకేనని.. రాష్ట్ర అభివృద్ధికి అవరోధంగా నిలిచే పనులను తెరాస ఎప్పటికీ చేయదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరితోనైనా స్నేహం చేసేందుకు సిద్ధమేనని కేకే తెలిపారు. నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ''రైతు చట్టాలను మేం వ్యతిరేకించాం. దిల్లీలో జనవరి 26న జరిగిన ఘటన సమర్థించదగినది కాదు. అలాగని ఈ ఘటనను సాకుగా చూపి రైతుల సమస్యలను విస్మరించవద్దు'' అని తెలిపారు.