ఆంధ్రభూమి లాకౌట్‌పై ఉద్యమిస్తాం - టీయూడబ్ల్యూజే

హైదరాబాద్‌,ఫిబ్రవరి 26(జనంసాక్షి):ఆంధ్రభూమి మూసివేత చట్ట విరుద్దం పునరుద్ధరణకు పెద్ద ఎత్తున ఆందోళన ఇండియన్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌ (ఐజెయు) హెచ్చరిక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ యూనియన్‌ శాఖల ఆధ్వర్యంలో త్వరలో ఆందోళన కార్యాచరణ: టీయుడబ్ల్యుజె ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా స్పందనIIఆంధ్రభూమి ఉద్యోగులకు ఏడాది కాలంగా బకాయి పడిన వేతనాలు, ఎఎఫ్‌, ఎరియర్స్‌ తో పాటు రిటైర్డు ఉద్యోగుల గ్రాడ్యూటీ, వేతన సవరణ ఎరియర్స్‌ వెంటనే చెల్లించాలన్న ప్రధాన డిమాం డ్లపై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టాలని ఇండియన్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌, తెలం గాణ స్టేట్‌ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ సంయుక్తంగా నిర్ణయించాయి. ఈ మేరకు శుక్ర వారం జరిగిన తెలంగాలు రాష్ట్ర శాఖ తీర్మానం చేసింది. అలాగే కాలపరమితి పూర్తి కాకుండానే తొల గించిన కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులు పునరుద్ధరించాలని కూడా డిమాండ్‌ చేసింది. బషీర్‌ బాగ్‌ లోని యూనియన్‌ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం టీయుడబ్ల్యుజె రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్‌, ప్రధాన కార్యదర్శి విరాహత్‌ అలీ అధ్యక్ష తన జరిగిన ఈ సమావేశానికి ఇండియన్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌ అధ్యక్షుడు కే శ్రీనివాస్‌ రెడ్డి, ప్రెస్‌ కౌన్సిల్‌ సభ్యుడు ఎంఏ మాజీద్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆంధ్రభూమి ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగులు, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సమస్యలను యూనియన్‌ రాష్ట్ర నాయకుడు, హైదరా బాద్‌ శాఖ మాజీ ప్రధాన కార్యదర్శి వెల్లాల చంద్రశేఖర్‌ యూనియన్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆంధ్ర భూమి ఉద్యోగుల డిమాండ్లకు ఇండియన్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌ పూర్తి సంఘీభావం ప్రకటిస్తుం దని జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ లో (ఎస్సెట్‌) దక్కన్‌ క్రానికల్‌ కేసు పెండింగ్‌ లో ఉండగా ఆంధ్రభూమి పత్రిక మూసివేత చెల్లదని, ఇది చట్టవి రుద్దమని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ యూనియన్‌ శాఖలతో చర్చించి త్వరలోనే ఆందోళ నకు కార్యాచరణ ఖరారు చేస్తామని ప్రకటించారు. రెండు రాష్ట్రాల యూనియన్‌ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో కార్యాచరణను ఖరారు చేయనున్నట్టు టీయుడబ్ల్యుజె అధ్యక్ష, కార్యద ర్శులు నగునూరి శేఖర్‌, విరహత్‌ అలీ ప్రకటించారు. ఇరు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున జర్నలిస్ట్‌ లను సవిూకరించి ఛలో హైదరాబాద్‌ వంటి కార్యక్రమానికి పిలుపు ఇస్తామని హెచ్చరించారు.ఆంధ్రభూమి ఉద్యోగుల పోరాటానికి సమావేశానికి హాజరైన అన్ని జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు సంఘీభావం ప్రకటించారు. ఐజెయు, టీయుడబ్ల్యుజె ఇచ్చే ఆందోళన కార్యక్రమాన్ని విజయ వంతం చేస్తామని హావిూ ఇచ్చారు. ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సభ్యుడు ఎంఏ మాజీద్‌ మాట్లా డుతూ, దక్కన్‌ క్రానికల్‌ కోల్‌ కత్తా ఎడిషన్‌ ఉద్యోగులు ప్రెస్‌ కౌన్సిలను ఆశ్రయించడంతో వారికి వేతనాలు చెల్లించే విధంగా చర్య తీసుకున్నట్టు వివరించారు. ఆంధ్రభూమి ఉద్యోగుల నుంచి ఫిర్యాదు అందితే వెంటనే చర్య తీసుకుంటామని ఆయన హావిూ ఇచ్చారు. ఈ సమావేశంలో ఇంకా జాతీయ నాయకులు వై నరేందర్‌ రెడ్డి, దాసరి కృష్ణారెడ్డి, విష్ణుదాసు శ్రీకాంత్‌, రాజేశ్‌, మహి పాల్రెడ్డి, శంకర్గౌడ్‌ తదితర నాయకులు హాజరయ్యారు.