మెందు తాగిన డ్రైవర్‌ కారెక్కితే ప్రయాణికులు కూడా జైలుకేకొత్త చట్టం హైదరాబాదులో అమలు
్ల హైదరాబాద్‌ 11 మార్చి (జనంసాక్షి) : సైబరాబాద్‌ పోలీసులు కొత్త చట్టాన్ని ప్రయోగిం చనున్నారు. ఇప్పటి వరకు మద్యం తాగి వాహనా లను నడిపేవారిపైనే కేసు నమోదు చేస్తున్న పోలీసులు.. ఇకపై కొత్త చట్టాన్ని అమ లు చేయనున్నారు. ఈ మేరకు సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ట్వీట్‌ చేశారు. తాగిన వ్యక్తి నడిపే వాహ నంలో ప్ర యాణించే వారిపైనా కేసు పెట్టబో తున్నట్లు సైబరా బాద్‌ పోలీసులు వెల్లడిం చారు. డ్రైవర్‌ తాగి ఉన్నా డని తెలిసీ ఆ వాహనం లో ప్రయాణిం చడం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. దీనికి సంబం ధించిన మోటారు వాహనాల చట్టంలోని 188వ సెక్షన్‌ను ప్రయోగించనున్నటుసైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఈ చట్టం ప్రకారం మద్యం తాగి వాహనం నడుపుతున్న డ్రైవర్‌తో పాటు అందులో ప్రయాణిస్తున్న వారూ జైలుకెళ్లక తప్పదు. తస్మాత్‌ జాగ్రత్త..!