ఇంత నియంతృత్వమా?



 కేంద్రం ధరల పెంపుపై భట్టి ఆవేదన

భద్రాద్రి 07 మార్చి (జనంసాక్షి):  అధికారంలో ఉన్న తాము ఏం చేసినా ప్రజలు భరిస్తారనే రీతిలో  భాజపా, తెరాస ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నా యని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. పెరుగు తున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలను నిరసిస్తూ.. భద్రాచలం నుంచి కాంగ్రెస్‌ నేతలు సైకిల్‌ యాత్ర నిర్వహించారు. అంతకుముందు భట్టితోపాటు పార్టీ నాయకులు బలరాం నాయక్‌, పొదెం వీరయ్య భద్రాద్రి రామయ్యను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సైకిల్‌ యాత్ర  ప్రారంభించిన కాంగ్రెస్‌ నేతలు ఆరు రోజుల పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నట్లు తెలిపారు. ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్న పార్టీలకు పట్టభద్రులు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు.