రేవంత్‌ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి


కెసిఆర్‌ను విమర్శించే స్థాయి నీది కాదు
చంద్రబాబు పెంపుడు కుక్క
ఘాటు వ్యాఖ్యలు చేసిన జీవన్‌ రెడ్డి

హైదరాబాద్‌,ఆగస్ట్‌26(జనంసాక్షి): పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఒక డ్రామా ఆర్టిస్టులా మారాడని ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి అన్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మానుకోవాలన్నారు. మాటతీరు మార్చుకొమ్మని చెప్పినా మారడం లేదని చెప్పారు. చంద్రబాబు పెంపుడు కుక్క అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌ చంద్రబాబు పెంపుడు కుక్కఅని మండిపడ్డారు.అసెంబ్లీలోని టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే విూడియాతో మాట్లాడారు. వందమంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తొక్కితే రేవంత్‌ 30 అడుగుల లోతుకు పోతాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ కాలిగోటికి సరిపోడని, ముఖ్యమంత్రిపై మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్‌ తెలంగాణ తెస్తేనే రేవంత్‌ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యారని విమర్శించారు. కాంగ్రెస్‌ అంటేనే జైలు పార్టీ, బెయిల్‌ పార్టీ అని ఎద్దేవా చేశారు. రేవంత్‌ తీరుపై ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్‌ గాంధీకి లేఖ రాశనని చెప్పారు. ఆయనది ఐరన్‌ లెగ్‌ అని, ఏ పార్టీలో చేరితే అది నాశనమవుతుందని పేర్కొన్నారు. రేవంత్‌ రెడ్డి ఎక్కడైనా విూటింగ్‌ పెట్టుకోవచ్చని, అయితే దళితబంధు, రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి పథకాలు వద్దని చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ అన్నీ చేసుంటే ఇప్పుడు మా అవసరం ఏమొచ్చేదన్నారు. మల్కాజిగిరిలో ఆయనకు చంద్రబాబు ఎంత డబ్బు పంపించిండో తనకు తెలుసునని వెల్లడిరచారు. గిరిజన ఎమ్మెల్యే సీతక్కతో చంద్రబాబు కాళ్లు మొక్కించాడని విమర్శించారు.