రోజుకు 30వేలు కాదు..పదివేలే

దుర్గగుడి భక్తుల సంఖ్యను కుదించిన పాలకమండలి

విజయవాడ,సెప్టెంబర్‌25  (జనంసాక్షి);  దుర్గగుడి అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్‌ 7 నుంచి 15 వతేదీ వరకు దసరా ఉత్సవాలు జరగనున్నాయి. మొదట్లో 30 వేల మందిని రోజుకు అనుమతిస్తున్నట్లు ప్రకటన చేశారు. కోవిడ్‌ హెచ్చరికల నేపధ్యంలో రోజుకు పదివేల మందిని మాత్రమే అనుమతించాలని తాజాగా నిర్ణయం తీసుకుంది. ఉచిత దర్శనం స్లాట్‌ బుకింగ్‌లో జీరో మనితో లోటు పాట్లను అధికారులు గుర్తించారు. అలాగే ఉచిత దర్శనం స్ధానంలో ఒక రూపాయి చెల్లించి స్లాట్‌ బుక్‌ చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. దేవస్థానం వద్ద దర్శనం టిక్కెట్లు ఇచ్చే అంశంపై వచ్చే సమావేశంలో అధికారులు చర్చించనున్నారు. భవానీ దీక్ష చేపట్టే భక్తులును దర్శనానికి మాత్రమే అనుమతి కల్పించనున్నారు.ఇరుముడులు సమర్పణకు ఎటువంటి ఏర్పాట్లు ఉండవని దేవస్థానం అధికారులు వెల్లడిరచారు.