బెంగుళూరు సిటీలో భారీ పేలుడు


పేలుడుకు ముగ్గురు దుర్మరణం
బెంగళూరు,సెప్టెంబర్‌23 (జనంసాక్షి) : బెంగళూరు నగరంలో భారీ పేలుడు సంభవించింది. చామరాజపేట లోని ఓ భవనంలో పేలుడు జరగడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. పేలుడు ధాటికి మృతదేహాలు తునాతునకలయ్యాయి. ఈ ఘటనలో గాయపడిన మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వి.వి.పురం పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పేలుడుకు గల కారణాలపై విచారణ చేపట్టారు. పంక్చర్‌ షాప్‌లోని కంప్రెషర్‌ వల్లే పేలుడు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో పంక్చర్‌ దుకాణ యజమాని అస్లాం అక్కడికక్కడే మృతి చెందాడు. పేలుడు శబ్దానికి స్థానికులు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. ఘటనపై స్థానికలుఉ భయాందోలనకు గగురయ్యారు. తొలుత ఇది ఉగ్రవాదుల పనేమో అన్న అనుమానాలు వచ్చాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.