అసెంబ్లీలో సమాచారంపై సన్నద్ధంగా ఉండాలి


అధికారులకు ఆదేశాలు ఇచ్చిన సిఎస్‌ సోమేశ్‌ కుమార్‌

హైదరాబాద్‌,సెప్టెంబర్‌23 (జనంసాక్షి) : తెలంగాణ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు 24వ తేదీ శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆయా శాఖల ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ బిఆర్‌ కె భవన్‌ లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. సమావేశాల సందర్భంగా వివిధ అంశాలు చర్చకు వస్తుంటాయి. ఆయా శాఖల ఉన్నతాధికారులు సరైన సమాచారాన్ని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. సభలో చర్చకు వచ్చే అంశం పై సంబంధిత శాఖల మంత్రులకు పూర్తి సమాచారాన్ని సిద్ధం చేసి ఇవ్వాలన్నారు. ప్రశ్నోత్తరాలతో పాటు పలు అంశాలపై చర్చలు జరుగుతుంటాయి. ఆయా శాఖల ఉన్నతాధికారులు కూడా అందుబాటులో ఉండాలన్నారు. విధి నిర్వహణలో ఎలాంటి ఊదాసీనత పనికి రాదన్నారు.