పోడు రైతుల హక్కుల హరణ


కెసిఆర్‌పై మండిపడ్డ కోదండరామ్‌

నిర్మల్‌,సెప్టెంబర్‌30  (జనం సాక్షి) : 2006 అటవీ హక్కు చట్టం ద్వారా పోడు సాగు చేస్తున్న రైతులకు హక్కు పత్రాలు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం మండిపడ్డారు. గురువారం ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌తో పాటు నిర్మల్‌ జిల్లాకేంద్రంలో పోడు రైతుల సమస్యలపై నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2006 అటవీ హక్కు చట్టం ద్వారా పోడు సాగు చేస్తున్న రైతులకు హక్కు పత్రాలను ఎందుకు ఇవ్వడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గత ఎన్నికల్లో ఇచ్చిన హావిూలన్నీ బూటకమేనన్నారు. పోడు భూముల సమస్య ఎక్కడ ఉన్నా అక్కడికి వచ్చి కుర్చీ వేసుకుని సమస్యను పరిష్కరిస్తానని చెప్పిన కేసీఆర్‌.. ఇప్పుడు ఎక్కడికెళ్లారని కోదండరాం ప్రశ్నించారు.