మద్యం డబ్బుల కోసం నానమ్మ హత్య


మనవడుఉ జగన్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు

చెన్నై,సెప్టెంబర్‌25  (జనం సాక్షి) :  మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో నానమ్మను మనవడు హత్య చేశాడు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది. పసువనపాలెం గ్రామానికి చెందిన సుశీల అంగన్‌వాడీ కార్యకర్తగా పని చేసి రిటైర్‌ అయ్యింది. ఆమె కుమారుడు రంగనాథన్‌ చెన్నైలోని వనగ్రామ్‌లో నివసిస్తున్నాడు. రంగనాథన్‌ కుమారుడు 30 ఏండ్ల జగన్‌ అప్పుడప్పుడు నానమ్మ ఇంటికి వస్తుండేవాడు. ఈ క్రమంలో ఇటీవల నానమ్మ సుశీల ఇంటికి వచ్చిన మనవడు జగన్‌ బుధవారం రాత్రి మద్యం కొని తాగేందుకు డబ్బులు అడిగాడు. దీనికి ఆమె నిరాకరించడంతో ఆగ్రహించిన జగన్‌ అట్ల పెన్నంతో నానమ్మ తలపై బలంగా కొట్టాడు. దీంతో ఆ వృద్ధురాలు చనిపోయింది. అనంతరం అక్కడి నుంచి పారిపోయిన జగన్‌ సవిూప గ్రామంలోని తన స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు వెళ్లి నిందితుడు జగన్‌ను అరెస్ట్‌ చేశారు. అతడ్ని ప్రశ్నించగా నానమ్మను తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.