వాణిజ్య ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యం

 రెండేళ్లలో ఎగుమతుల్లో 19.43 శాతం వృద్ధి
వాణిజ్యవేత్తలకు అవార్డుల బహుకరణ
వాణిజ్య ఉత్సవం`2021’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌
విజయవాడ,సెప్టెంబర్‌21 (జనంసాక్షి):  పారిశ్రామికవేత్తలకు తమ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వాణిజ్య ఎగుమతులను రెట్టింపు
చేయడమే లక్ష్యంగా మంగళవారం ఏర్పాటు చేసిన ’వాణిజ్య ఉత్సవం`2021’ కార్యక్రమాన్ని సీఎం జగన్‌ ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఏపీ ఎగుమతులు రెండేళ్లలో 19.43 శాతం వృద్ధి చెందాయని పేర్కొన్నారు. 2020`2021లో రూ. 1.23 లక్షల కోట్ల ఎగుమతులు జరిగాయని అన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ మొదటి స్థానంలో ఉందని తెలిపారు. 2020`2021లో ఎగుమతుల్లో ఏపీ నాలుగో స్థానంలో ఉందని సీఎం తెలిపారు. రెండేళ్లలో? రూ. 20, 390 కోట్లతో 10 మెగా ప్రాజెక్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. దీని ద్వారా 55 వేల మందికి ఉపాధి కల్పించినట్లు పేర్కొన్నారు. అనంతరం వాణిజ్య ఉత్సవ్‌లో ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం జగన్‌ సందర్శించారు. స్టాల్స్‌ను పరిశీలించిన సీఎం జగన్‌ ఉత్పత్తులకు సంబంధించి పలు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏపీ ఎగుమతుల రోడ్‌ మ్యాప్‌ బ్రోచర్‌ను సీఎం వైఎస్‌ జగన్‌ విడుదల చేశారు.ఎగుమతులకు సంబధించి ప్రత్యేకంగా ఈ` పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల ప్రముఖులు, రాయబారులు, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. విశాఖ` చెన్నై, చెన్నై` బెంగళూరు, హైదారాబాద్‌` బెంగళూరు ఇండస్టీయ్రల్‌ కారిడార్లను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని తెలిపారు. కొప్పర్తిలో 3,155 ఎకరాల్లో వైఎస్‌ఆర్‌ జగనన్న మెగా ఇండస్టీయ్రల్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రూ. 730 కోట్ల పెట్టుబడితో 801 ఎకరాల్లో వైఎస్సార్‌ ఎలక్టాన్రిక్స్‌ మాన్యుఫాక్షరింగ్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో 3గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టులు, 13వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 2023`2024 కల్లా భావనపాడు, మచిలీపట్నం, రాయామపట్నం పోర్టులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 3 వేల మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో రూ. 500 కోట్లతో స్టీల్‌ ఎª`లాంట్‌ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గెయిల్‌తో కలిసి గ్యాస్‌ డిస్టిబ్యూష్రన్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. విద్యార్థుల్లో నైపుణ్యం అభివృద్ధికి 25 ప్రపంచస్థాయి కళాళాలలు ఏర్పాటు చేశామని తెలిపారు. దేశ ఎగుమతుల్లో రాష్ట్రం 10 శాతం వాటి సాధించడమే లక్ష్యమని అన్నారు. 2030 నాటికి 33.7 బిలియన్‌ డాలర్ల విలువైన ఎగుమతులే లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో సెకండరీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేసి, రూ. 2,500 కోట్ల పెట్టుబడితో 80 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని సీఎం జగన్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర వాణిజ్య ఎగుమతులు రెట్టింపు చేయడమే లక్‌క్ష్యమని అన్నారు. ఏపీ ఎగుమతులు రెండేళ్లలో 19.43 శాతం వృద్ధి చెందాయని తెలిపారు. ఫార్మా ఎలక్టాన్రిక్స్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, టెక్స్‌టైల్‌ ఎగుమతులకు భారీ అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఏపీ నుంచి ఎగుమతులను ప్రోత్సహించేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉందని మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి తెలిపారు. వాణిజ్య ఉత్సవ్‌ ఇనాగరేషన్‌ సెషన్‌లో మంత్రి మాట్లాడుతూ వాణిజ్య ఉత్సవం పేరిట నిర్వహిస్తున్న ఈ సమావేశానికి 600 ఉత్పత్తిదారులు ఎగుమతిదారులు హాజరువుతున్నారన్నారు. తైవాన్‌, ఏపీ వైశాల్యం అంతే ఉన్నప్పటికీ భారతదేశంతో ఎగుమతుల్లో పోటీపడుతోందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ఎగుమతులపై ప్రధానంగా దృష్టి పెట్టిందన్నారు. ఇక్కడ ఉన్న ఎగుమతి అవకాశాల గురించి ప్రపంచానికి చాటి చెప్పాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన అని చెప్పారు. కొవిడ్‌ కారణంగా ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో పడిరదని... ఎగుమతులు ప్రభావితం అయ్యాయన్నారు. రాష్ట్రంలో వివిధ వనరులతో పాటు నైపుణ్యం వంటి మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి పేర్కొన్నారు.