అసెంబ్లీ పరిసరాల్లో నిషేధాజ్ఞలు: సిపి


హైదరాబాద్‌,సెప్టెంబర్‌23 (జనంసాక్షి) : తెలంగాణ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్న నేపధ్యంలో అసెంబ్లీ పరిసరాల్లోని 4 కి.విూ. పరిదిలో సభలు, సమావేశాలు, ఊరేగింపులను నిషేధించినట్టు హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివిధ ప్రజా సమస్యలపై అసెంబ్లీలో జరిగే చర్చలకు ఎలాంటి ఆటంకం కలగకూడదని ఈ నిషేదాజ్ఞలు అమలు చేస్తున్నట్టు తెలిపారు.శుక్రవారం ఉదయం 6గంటల నుంచి ఈ నిషేదాజ్ఞలు అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు ముగిసే వరకూ వర్తిస్తాయని ఆయన తెలిపారు.