పునరావాస పరిహారం చెల్లించాలి

భద్రాచలం,సెప్టెంబర్‌27 జనంసాక్షి 

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాస పరిహారం వెంటనే విడుదల చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్‌ చేశారు. భూములకు పరిహారం ఇచ్చి నిర్వాసితులకు పునరావాస పరిహారం ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. పునరావాస ప్యాకేజీ తెలంగాణలో కుటుంబానికి రూ.12 లక్షల 50 వేలు ఇస్తున్నారని ఇక్కడ కూడా అదే ప్యాకేజీ ఇవ్వాలన్నారు. గిరిజనులకు భూమికి భూమి, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో ఇచ్చి, పునరావాస కాలనీలు కుక్కునూరులో నిర్మిస్తే వ్యవసాయం ఎలా చేయగలరని ప్రశ్నించారు. 2013 భూ సేకరణ చుట్టం ప్రకారం పునరావాసం కల్పిం చాలని కోరారు. కొందరు భూస్వాములు పేదలకు పరిహారం ఇస్తే తమ భూమిలోకి కూలీలు రారని ప్రచారం చేయడాన్ని ఆయన ఖండిరచారు. అది వారి వర్గదురహం కారాన్ని వెల్లడిస్తుందన్నారు. పరిహారం విడుదల కాకపోవడానికి వీరి పైరవీలేమైనా లేక ఏదైనా కారణాలున్నాయో తెలపాలని ప్రశ్నించారు. తక్షణం పునరావాస పరిహార లబ్ధిదారుల జాబితాను విడుదల చేయాలని కోరారు.