విధిగా అందరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలి

కరోనా ప్రచార వాహనాలకు మంత్రి జెండా

వరంగల్‌,సెప్టెంబర్‌23 (జనంసాక్షి) : ప్రతి ఒక్కరూ కొవిడ్‌ వాక్సిన్‌ విధిగా తీసుకోవాలని పంచాయతీ రాజ్‌ గ్రావిూణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కోరారు. గురువారం హసన్‌పర్తి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో మంత్రి ఎర్రబెల్లి శాసనసభ సభ్యులు ఆరురి రమేష్‌, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతుతో కలసి కొవిడ్‌ ప్రచార వాహనాలను జెండా ఊపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేర్‌ ఇండియా స్వచ్ఛంద సంస్థ సౌజన్యంతో జిల్లా కు 12 కోవిడ్‌ వాహనాలు అందించడం పట్ల సంస్థ ప్రతినిధులను అభినందించారు. ఈ వాహనాల ద్వారా కోవిడ్‌ టీకాలు వేగవంతం చేయడానికి, కరొనా నియంత్రణకై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కలుగుతుందని అన్నారు.వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెఓ డాక్టర్‌ మదన్‌ మోహన్‌, డిప్యూటీ డిఎంహెఓ డాక్టర్‌ యాకుబ్‌ పాష , డాక్టర్లు శ్రీకృష్ణ రావు మల్లి కార్జున్‌ రావు ,గీతాలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.