జమ్మికుంట దర్గాలో టిఆర్‌ఎస్‌ ప్రార్థనలు

హుజురాబాద్‌,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి): జమ్మికుంట మండలంలోని బిజిగిర్‌ షరీఫ్‌ దర్గాలో కేసీఆర్‌ సేవాదళం ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. హుజూరాబాద్‌ ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లుశ్రీనివాస్‌ యాదవ్‌ అత్యధిక మెజారిటీ తో గెలవాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్‌ సేవాదళం జిల్లా జనరల్‌ సెక్రటరీ ఎస్‌ కే. హుస్సేన్‌ పాషా, జమ్మికుంట మండల అధ్యక్షులు మొహమూద్‌ ముస్తఫా, జమ్మికుంట పట్టణ అధ్యక్షులు చంటి,సేవాదళం నాయకులు ఎండీ.యాకుబ్‌ పాషా, ప్రేమ్‌ వినయ్‌ అఫ్రోజ్‌ తదితరులు పాల్గొన్నారు.