మహిళాబిల్లు తేవడంలో విఫలం: ఐద్వా

 హైదరాబాద్‌,సెప్టెంబర్‌27 జనంసాక్షి : మహిళా రిజర్వేషన్‌ బిల్లు తేవడంలో ప్రభుత్వం విఫలమయ్యిందని ఐద్వా నేతలు అన్నారు. నాటి కాంగ్రెస్‌, నేటి బీజేపీ ప్రభుత్వాలు మహిళలకు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని చెప్పి మొండి చేయి చూపించాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓటు బ్యాంక్‌ రాజకీయాల కోసం సంక్షేమ పథకాలను ఉపయోగించుకుంటున్నాయని అన్నారు. దీనేఇపై ఎక్కడిక్కడ బిజెపిని నిలదీయాలన్నారు. సంక్షేమ పథకాలంటే ప్రజల అవసరాలు తీర్చేవిగా ఉండాలని, ప్రచార ఆర్భాటాల కోసం కాదని చెప్పారు. కొందరు బాబాల ముసుగులో అనేక దుర్మార్గాలకు పాల్పడుతుంటే కేంద్ర ప్రభుత్వం వాటిని కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తోందన్నారు. మహిళలకు కనీస వేతనం అమలు చేసి వారికి ఉపాధి కల్పించాలని డిమాండ్‌ చేశారు.