ఖమ్మం జిల్లా వరప్రదాయినిగా భక్తరామదాసు ప్రాజెక్టు

 


ఖమ్మం,సెప్టెంబర్‌30 (జనం సాక్షి)  జిల్లా ప్రజలకు భక్తరామదాసు ప్రాజెక్టు వరప్రదాయిని అని మంత్రి పువ్వాడ అజయ్‌ పేర్కొన్నారు. దానిని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. భక్తరామదాసు ప్రాజెక్టు పనులు 92 శాతం పూర్తి అయ్యాయని తెలిపారు. ప్రాజెక్టు అంచనా వ్యయం 90.87 కోట్లు అని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా 5.5 టీఎంసీల నీటిని 50 వేల ఎకరాలకు పైగా అందించ బోతున్నాం. తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్లు ఇస్తుందని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో ప్రాజెక్టులు కట్టాలంటే సంవత్సరాలు పట్టేదన్నారు. ఖమ్మంలోని కరువు ప్రాంతాలకు నీరందించాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్‌ భక్తరామదాసు ప్రాజెక్టు చేపట్టారని స్పష్టం చేశారు.