అయ్యన్నపాత్రుడుపై ఎస్సీఎస్టీ కేసు

అమరావతి,సెప్టెంబర్‌24 (జనంసాక్షి)  : తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయింది. గుంటూరుకు చెందిన న్యాయవాది వేముల ప్రసాద్‌ చేసిన ఫిర్యాదుతో అరండల్‌ పేట పోలీసులు అయ్యన్నపై కేసు నమోదు చేశారు. మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు వర్ధంతి సభలో హోంమంత్రిపై చేసిన వ్యాఖ్యలు తమకు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ న్యాయవాది ప్రసాద్‌ ఫిర్యాదు చేశారు. అయ్యన్న పాత్రుడుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతోపాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.