తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 162 కరోనా కేసులు

 

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 162 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ కరోనా బులెటిన్‌ను అధికారులు విడుదల చేశారు. రాష్ట్రంలో కరోనాతో ఒకరు మరణించారు. అలాగే కొత్తగా 247 మంది కరోనా బాధితులు కోలుకున్నట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలోని యాక్టివ్ కేసుల సంఖ్య 4,455కు చేరింది. రాష్ట్రంలో ఇవాళ మొత్తం 32,828 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.