గిరిజనేతర రైతులతోనే సమస్యలు

 


పోడులో వారూ మందున్నారంటున్న అధికారులు
సాగుపై కొనసాగుతున్న కఠిన ఆంక్షలు పెట్టిన అటవీ సిబ్బంది
రెవెన్యూ,అటవీ శాఖ మధ్య సమన్వయంతోనే సమస్యకు చెక్‌
ఆదిలాబాద్‌,అక్టోబర్‌27  (జనం సాక్షి): ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనేతర రైతులు కూడా పోడు భూములను సాగు చేసుకోవడంతో ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారుతుంది. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం 2005 డిసెంబరు 31 లోపు అటవీ భూములను సాగు చేసుకున్న వారి కి హక్కు పత్రాలు అందించాలని కేంద్ర అటవీ హక్కుల చట్టం పేర్కొంటుంది. జిల్లాలో ఒక లక్ష ఎకరాల వరకు పోడు భూములు ఉన్నట్లు అ టవీ శాఖాధికారులు అంచనా వేస్తున్నారు. అనాధికారికంగా మాత్రం పోడు భూముల విస్తీర్ణం మరింత అధికంగానే ఉం టుందని గిరిజన సంఘాల నేతలు చెబుతున్నారు. పోడు సాగు చేసుకుంటున్న రైతుల పరిస్థితి దయనీయంగా మారుతుంది. ప్రతి ఏడు సీజన్‌ ప్రారంభమైనప్పటి నుంచి పంట చేతికి వచ్చే వరకు అటవీ శాఖాధికారుల నుంచి ఆంక్షలే ఎదురవుతున్నాయి. పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2018 కటాఫ్‌ డెట్‌ను తెరపైకి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పొరుగు రాష్ట్రమైన ఆంధప్రదేశ్‌లో 2018ని కటాఫ్‌డెట్‌గా పేర్కొంటూ కేంద్రానికి నివేదిక ఇచ్చిన ఫలితం కనిపించడం లేదు. ప్రభుత్వం అడుగులు వేసేందుకు సిద్ధమైనట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. గతంలోనూ చేపట్టిన భూసమగ్ర సర్వే ద్వారా పో డు భూములకు పరిష్కారం దక్కలేదు. ఇప్పటికీ పోడు రైతులు అవే క ష్టాలను ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా అటవీ, రెవెన్యూ శాఖ మధ్య సమన్వయం లేకపోవడంతో భూహద్దులపై వివాదమే కొనసాగుతుంది. గతంలో కొందరికి హక్కు పత్రాలు
ఇచ్చి ఎలాంటి కారణం చెప్పకుండానే వేల దరఖాస్తులను తిరస్కరించారు. దీంతో పోడు రైతుల్లో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభు త్వం ఏం పరిష్కారం చూపుతుందోనన్న ఆసక్తి నెలకొంది. ఏనా డైనా భూమిపై హక్కులు రాకపోతాయన్న ఆశతో ఎదురు చూస్తున్నారు. తాజాగా పోడు భూములకు
పరిష్కారం చూపుతామంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో గిరిజన రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సవిూక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌, ఐటీడీఏ పీవో భవేశ్‌మిశ్రా, అటవీ శాఖ కన్జర్వేటర్‌ అధికారి రామలింగం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా పోడు భూముల వివరాలను ప్రభుత్వానికి అందజేశారు. అయితే గతంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 56,358 మంది పోడు రైతులు హక్కు పత్రాల కోసం దరఖాస్తు చేసుకోగా, ఇందులో గ్రామ సభల ద్వారా 37,372 దరఖాస్తులకు ఆమోదం లభించింది. సుమారు మరో 25వేల మంది వరకు అర్హులైన రైతులు ఉన్నట్లు అంచ నా వేస్తున్నారు. కొన్నేళ్లుగా పోడు భూముల హక్కు పత్రాల కోసం ఆందోళనలు చేపడుతున్న ప్రభుత్వాలు సమస్యకు పరిష్కారం చూపడం లేదంటూ గిరిజన రైతులు వాపోతున్నారు. 2014, 2018 ఎన్నికల్లో జిల్లాలో పర్యటించిన కేసీఆర్‌ ప్రధానంగా పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపుతామంటూ హావిూలిచ్చి ఏడేళ్లు గడుస్తున్నా పరిష్కారం కాకపోవడంతో గిరిజన రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. ఏజెన్సీలో గిరిజనేతర రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామంటూ ఎన్నోసార్లు చెప్పిన హావిూలు అమలుకు నోచుకోవడం లేదు. 2018 ఎన్నికల సమయంలో మూ డు రోజుల పాటు జిల్లాలోనే కూ ర్చి వేసుకొని పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపుతానని ఏకంగా ముఖ్యమంత్రే చెప్పినా అడుగు ముందుకు పడినట్లు కనిపించడం లేదు. హావిూలు ఎలా ఉన్న కుటుంబాన్ని పోషించుకునేందుకు గిరిజన రైతులు ఏటా పోడు భూములను సాగు చేసుకుంటున్న అటవీ శాఖాధికారుల బెదిరింపులు ఆగడం లేదు. చేతికి వచ్చిన పంటను అధికారులు కళ్ల ముందే ధ్వంసం చేయడంతో బతుకుపై భరోసా లేక ఉసురు తీసుకుంటున్నారు. ఇదిలావుంటే ప్రభుత్వాలు చిత్తశుద్ధితో 2006 అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలని గిరిజన నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ఏ మాత్రం కటాఫ్‌డేట్‌ను పెంచినా గిరిజన రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. న్యాయపరమైన చిక్కులతో సమస్య పరిష్కారం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందన్నారు. చట్టం పేరిట అధికారులు పోడు రైతులను వేధిస్తే సహించేది లేదన్నారు.