ఉత్తరాఖండ్‌లో బిజెపికి షాక్‌

మంత్రి యశ్‌పాల్‌, కుమారుడు సంజీవ్‌ ఆర్య పార్టీకి రాజీనామా

కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటన
న్యూఢల్లీి,అక్టోబర్‌11 (జనంసాక్షి): ఉత్తరాఖండ్‌లో అధికార బీజేపీకి షాక్‌ తగిలింది. మంత్రి యశ్‌పాల్‌ ఆర్య, ఆయన కుమారుడు సంజీవ్‌ ఆర్యతో కలిసి సోమవారం కాంగ్రెస్‌లో చేరారు. యశ్‌పాల్‌ ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంలో రవాణాశాఖ మంత్రి కొనసాగుతుండగా.. సంజీవ్‌ నైనిటాల్‌ ఎమ్మెల్యేగా పని ఉన్నారు. ఢల్లీిలో హరీశ్‌రావత్‌, రణదీప్‌ సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్‌ సమక్షంలో తండ్రీ కొడుకులు కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌లో చేరడానికి ముందు ఆయన బీజేపీ సభ్యత్వానికి, మంత్రి పదవికి సైతం రాజీనామా చేశారని రణదీప్‌ సుర్జేవాలా తెలిపారు. యశ్‌పాల్‌ గతంలో ఉత్తరాఖండ్‌ పీసీసీ చీఫ్‌గా పని చేయగా.. తిరిగి పార్టీలో చేరడం ’ఇంటి రావడం’ లాంటిదని కేసీ వేణుగోపాల్‌ పేర్కొన్నారు. యశ్‌పాల్‌ 2007`14 వరకు ఉత్తరఖండ్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ చీఫ్‌గా కొనసాగారు.