పరువుకు భంగం వాటిల్లేలా ప్రసారాలు


పలు యూ ట్యూబ్‌ ఛానళ్లపై సమంత ఫిర్యాదు

హైదరాబాద్‌,అక్టోబర్‌20(జనం సాక్షి):తన పరువుకి భంగంవాటిల్లిందని పలు యూట్యూబ్‌ ఛానళ్లపై ప్రముఖ నటి సమంత పరువు నష్టం దావా వేశారు. సుమన్‌ టీవీ, తెలుగు పాపులర్‌ టీవీతోపాటు సీఎల్‌ వెంకట్రావుపై పిటిషన్‌ దాఖలు చేశారు. సోషల్‌ విూడియాలో తనపై అసత్య ప్రచారాలు చేస్తూ తనని కించపరిచారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు కూకట్‌పల్లి కోర్టుని ఆశ్రయించారు. తనపై దుష్పచ్రారం చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టుని కోరారు. ఈ రోజు సాయంత్రం సమంత తరఫు న్యాయవాది తమ వాదన వినిపించనున్నారు. నాగ చైతన్యతో వివాహ బంధానికి స్వస్తి పలికిన తర్వాత సమంతపై సోషల్‌ విూడియాలో విపరీతంగా ట్రోల్స్‌ వచ్చిన సంగతి తెలిసిందే.