వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం

హైదరాబాద్‌,అక్టోబర్‌11 (జనంసాక్షి) : హైదరాబాద్‌, వికారాబాద్‌ జిల్లాలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందారు. హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలో ఆదివారం అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. ఎర్రగడ్డ మెట్రో స్టేషన్‌ కింద ఇటుకల లారీ బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మూసాపేట నుంచి ఎర్రగడ్డ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో ఘటనలో.. వికారాబాద్‌ జిల్లాలోని పరిగి మండలం గడిసింగాపూర్‌ వద్ద లారీ ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. సమాచారం అందుకున్న హోంగార్డు బాలాజీ.. బైకుపై ఘటనా స్థలానికి వెళ్తున్నాడు. ఈక్రమంలో అతడి మరో వాహనం ఢీకొట్టింది. దీంతో అతడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.