హైదరాబాద్,అక్టోబర్25(జనంసాక్షి):
బుద్ధ భవన్‌లోని జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీస్ ముందు బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. గ్రేటర్ హైద్రాబాద్ వ్యాప్తంగా టీఆర్‌ఎస్ ప్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగ్‌లు ఉన్నా... ఎలాంటి ఫైన్లు వేయడం లేదని, వాటిని తొలగించడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రతి పక్షాలకు ఒక న్యాయం, అధికార పార్టీకి ఓ న్యాయమా అంటూ బీజేపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. పోలీసుల భారీగా మోహరించారు. హైదరాబాద్ వ్యాప్తంగా టీఆర్‌ఎస్ ప్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగ్‌లు ఉన్నా... ఎలాంటి ్గªన్లు వేయడం లేదని, వాటిని తొలగించడం లేదని ఆరోపించారు. ప్రతి పక్షాలకు ఒక న్యాయం, అధికార పార్టీకి మరో న్యాయమా? అంటూ బీజేపీ కార్పొరేటర్లు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.
దళితబంధుపై ముగిసిన వాదనలుతీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టుహైదరాబాద్,అక్టోబర్25(ఆర్‌ఎన్‌ఎ): దళిత బంధు పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది. దళిత బంధువును ఎన్నికల సంఘం ఆపడానికి సవాల్ చేస్తూ హైకోర్టులో నాలుగు పిటీషన్‌లు దాఖలయ్యాయి. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు పథకం అమలవుతుందని పిటీషనర్లు పేర్కొన్నారు. ఒక్క హుజురాబాద్‌లోనే దళిత బంధు పథకం అమలు కావడం లేదన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో అమలవుతుందని కోర్టుకు పిటిషనర్లు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం మహిళా పోషన్ అబ్యాన్ కొనసాగించే విధంగానే దళిత బంధువు పథకాన్ని కూడా కొనసాగించాలని కోరారు. దళిత బంధు పథకాన్ని ఆపడం వలన చాలామంది వెనుకబడిన వారు ఆత్మహత్యలు చేసుకునే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న దళిత బంధు పథకాన్ని ఇప్పుడు ఎన్నికల సంఘం ఆపడం సరైంది కాదని తెలిపారు. వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం నిలిపివేసిన దళిత బంధు పథకాన్ని అమలు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును పిటిషన్లను కోరారు. వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.