రోజూ ఐదు యజ్ఞాలు చేయాలి

తిరుమల,అక్టోబర్‌25 ,(జనంసాక్షి):ప్రతిరోజూ అయిదురకాల యజ్ఞాలను చేయాల్సి ఉంటుందంటారు. దేవయజ్ఞం` పంచభూతాలకు కృతజ్ఞతలు తెలియజేసుకోవడం. రుషి యజ్ఞం` జీవించడానికి అవసరమయ్యే వివేకాన్ని తమ జ్ఞానంతో అందించిన రుషులకు కృతజ్ఞతలు చెప్పుకోవడం. ప్రతిరోజూ పవిత్ర గ్రంథాల పఠనం, శ్రవణం... పితృయజ్ఞం` వివిధ లోకాల్లో ఉండే పూర్వులకు కలశంలో నీటిని, కొంత ఆహారాన్ని సూర్యభగవానుడి ఎదుట సమర్పించడం. అతిథి యజ్ఞం` తోటివారి పట్ల కృతజ్ఞతతో మెలగడం. ఆకస్మికంగా వచ్చే అతిథికో, ఆకలితో ఉన్న ఓ వ్యక్తికో ఆహారాన్ని అందించడం. భూతయజ్ఞం` గోవులకు, పశుపక్ష్యాదులకు, క్రిమికీటకాలకు ఆహారం ఏర్పాటు చేయడం. ఈ అయిదు యజ్ఞాలు ప్రతిరోజూ చేస్తూ తమ కర్తవ్య నిర్వహణను సక్రమంగా చేయాలంటారు. ఫలితాలను దైవప్రసాదంగా స్వీకరించాలి.