ఢల్లీిలో పోలీస్‌ స్టేషన్‌పై దాడి ఘటన

53 మంది నైజీరియన్ల అరెస్ట్‌

న్యూఢల్లీి,అక్టోబర్‌1 (జనం సాక్షి) : దేశ రాజధాని ఢల్లీిలోని ఓ పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేసిన ఘటనలో 53 మంది విదేశీయులను అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారంతా నైజీరియా దేశస్థులై ఉంటారని భావిస్తున్నారు. సెప్టెంబర్‌ 27వ తేదీన మోహన్‌ గార్డెన్‌ పోలీస్‌ స్టేషన్‌పై నైజీరియన్లు కర్రెలు, రాళ్లతో దాడి చేశారు. విదేశీయులు దాడి చేసిన ఘటనలో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. అయితే ఆ సమయంలో గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు గాలిలో కాల్పులు జరిపారు. పోలీస్‌ స్టేషన్‌ లోపలికి వెళ్లిన విదేశీయులు.. తీవ్ర విధ్వసం సృష్టించారు. ఇటీవల తమ గ్రూపునకు చెందిన ఓ వ్యక్తి మరణించిన నేపథ్యంలో.. నైజీరియన్లు ఆగ్రహంగా ఉన్నారు. అయితే ఆ వ్యక్తికి వైద్య పరీక్షలు చేయాలని పోలీసులు భావించారు. దీన్ని నైజీరియన్లు వ్యతిరేకించారు. దాంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది.