ఆర్‌ఇసి మాజీ ప్రిన్సిపల్‌ కొతత్‌ మృతికి బాబు సంతాపం

అమరావతి,అక్టోబర్‌1 (జనం సాక్షి) : వరంగల్‌ ఆర్‌ఈసీ మాజీ ప్రిన్సిపల్‌ కొత్త కోటేశ్వరరావు మృతి బాధాకరమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కోటేశ్వరరావు కుటుంబసభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విద్యారంగానికి కోటేశ్వరరావు చేసిన సేవలు అనిర్వచనీయమని కొనియాడారు. కోటేశ్వరరావుతో తనకున్న అనుబంధం విడదీయలేనిదన్నారు. విద్యా విధానంలో అవసరమైన సలహాలు, సూచనలిచ్చేవారని గుర్తుచేశారు. గొప్ప విద్యావేత్త, పరిపాలనా దక్షుడిని కోల్పోయామని చంద్రబాబు వ్యాఖ్యానించారు.