గోపన్‌పల్లి తాండాలో కూలి హత్య

హైదరాబాద్‌,అక్టోబర్‌11(జనం సాక్షి): గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గోపన్‌పల్లి తండా రంగనాథ్‌ నగర్‌ కాలనీలోని ఓ గెస్ట్‌ హౌస్‌లో కూలి పని చేసుకునే మూడవత్‌ శేఖర్‌ నాయక్‌ (30)ను గుర్తుతెలియని వ్యక్తులు మెడ భాగంలో నరికి చంపారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాకు చెందిన శేఖర్‌ నాయక్‌ బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి గోపన్‌ పల్లి తండాలో నివాసం ఉంటున్నాడు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.