రంగారెడ్డి,అక్టోబర్25 (జనంసాక్షి): హైదరాబాద్ నగర శివార్లలోని రాజేంద్రనగర్లో ఇద్దరు పిల్లలతోపాటు తల్లి అదృశ్యమయ్యారు. రాజేంద్రనగర్ పరిధిలోని ఎమ్ఎమ్ పహాడీకి చెందిన అవ్రిూన్ తన ఇద్దరు పిల్లలు అక్షబేగం, అజా బేగంతో కలిసి ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. సాయంత్రం పొద్దుపోయినప్పటికీ వారు ఇంటికి తిరిగి రాకపోవడంతో.. భర్త అబ్రార్ చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించాడు. సవిూప బంధువులకు ఫోన్ చేసి వాకబు చేశాడు. ఎంతకీ వారి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇద్దరు పిల్లలతో తల్లి అదృశ్యం