` అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్,అక్టోబరు 4(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. పర్యాటకం, ఇతర విషయాల్లో కేంద్రం పట్టించుకోవట్లేదని ఆరోపించారు. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధిలో నిరాదరణకు గురైనట్లు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 160 కి.విూ. మేర గోదావరి సజీవంగా పారుతోందని శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన స్పష్టం చేశారు. తమ ప్రాంతాల్లో పర్యాటక, ప్రాచూర్యం పొందిన ప్రాంతాలు ఉంటే ఎమ్మెల్యేలు నివేదిక ఇవ్వాలని కోరారు.తెలంగాణలో అద్భుతమైన అటవీ సంపద, జలపాతాలు ఉన్నాయన్న కేసీఆర్.. పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ‘‘తెలంగాణ చరిత్ర, సంప్రదాయాలు, గొప్ప కళల ప్రాంతం. 58 ఏళ్ల సమైఖ్య పాలనలో తెలంగాణ నిరాదరణకు గురైంది. తెలంగాణను పట్టించుకోలేదు.. ప్రోత్సహించలేదు. ఖమ్మంలో పాండవుల గుట్టను పట్టించుకోలేదు. తెలంగాణలో కళాకారులు, విశిష్టమైన వ్యక్తులు ఉన్నారు’’ అని కేసీఆర్ అన్నారు.
తెలంగాణపై కేంద్రం వివక్ష ` అయినా అధిగమిస్తాం