అద్భుతాలు సాధించామంటున్న కమలనాథులు

 


ధరల మోతతో నడ్డి విరుగుతోందంటున్న ప్రజలు
ఆత్మ విశ్లేషణ చేసుకోని బిజెపి నేతలు
న్యూఢల్లీి,అక్టోబర్‌8  (జనంసాక్షి) : అద్భుతాలు సాధించామని చెప్పుకుంటున్న బిజెపి నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఏ మేరకు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చగలిగామో మననం చేసుకోవాలి. మాటలు చెప్పడం, ప్రణాళికలు ప్రకటించడం వేరు..వాటిని అమలు చేయడం వేరు. ఈ దేశంలో పాలకవర్గాలు ప్రజలను పావులుగా వాడుకుంటున్నారు. మూసరాజకీయాలు నడిపించారు. ముఖ్యంగా జాతీయత, ఆర్థిక విధానాలు, నదీజలాలు, వ్యవసాయం, మహిళలకు సమాన హోదా తదితర అంవాల్లో బిజెపి వైఫల్యం చెందింది. కేంద్ర రాష్టాల్ర మధ్య కొత్త సంబంధాలను నెలకొల్పుతామని నీతి ఆయోగ్‌ ఏర్పాటు సమయంలో ప్రధాని మోడీ ప్రకటించారు. అయినా ఆచరణకు నోచుకోలేదు. అందుకే సింహం గర్జించింది. ఉన్న పార్టీల పంచన చేరడంకన్నా ప్రజలను చైతన్యం చేయడం మేలని భావించిన కెసిఆర్‌ జెండా భుజాన వేసుకున్నారు. 20
ఏళ్లుగా పాలనలో ఉన్న మోడీ అద్భుతాలు చేశారని బిజెపి అధ్యక్షుడు నడ్డా ప్రకటించారు. అయితే ఏ రకమైన అద్భుతమో చెప్పలేదు. 370 రద్దు చేశాక కూడా కాశ్మీర్ల్‌ఓ హిందువుల ఊచకోత ఆగడం లేదు. ధరలు అమాంతంగా పెరిగాయి. పెట్రో, గ్యాస్‌ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. వీటిని ఏ రకమైన అభివృద్ది అనగలమో బిజెపి చెప్పాలి. విభజన సమస్యలపై అప్పటి యూపీఏ ప్రభుత్వం విభజన చట్టంలో నిర్ణీత కాలపరిమితిని పొందుపర్చకుండా నిర్లక్ష్యం చేసింది. ఇదే ఇప్పుడు బిజెపికి కలసి వస్తోంది. యూపిఎ స్పష్టత ఇవ్వకపోవడాన్ని ఇప్పుడు బీజేపీకి సాకుగా తీసుకుంటోంది. పదేళ్ల సమయం ఉందన్న వాదనను తెరపైకి తెచ్చినా ఏడేళ్ల కాలంలో ఏదీ పూర్తి చేయలేదు. వైకాపా తీరుతో కేంద్రం ఇంకా కావాలనే కాలయాపన చేస్తోంది. ఈ విషయంలో బిజెపి నేతలు కూడా చేష్టలుడిగి చూస్తున్నారు. ప్రజలు ఎన్నో ఆశలతో బిజెపికి అందలం ఎక్కిస్తే అందుకు అనుగుణంగా కిందిస్థాయిలో హావిూలు నెరవేరి ప్రజలు బాగుపడు తున్నారా లేదా అన్నది చూడాలి. కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చి ఏరేళ్లు కావస్తోంది. 60 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌ దేశాన్ని అన్ని విధాలా భ్రష్టు పట్టించింది. దేశాన్ని నిర్వీర్యం చేసింది. అందులో ఎలాంటి సందేహం కానీ అనుమానం కానీ అక్కర్లేదు. తమకు ఐదేళ్లు పాలించే సేవాభాగ్యాన్ని కల్పిస్తే అద్భుతాలు చేస్తానని, ప్రజలకు జవాబుదారీగా ఉంటానని మోడీ ఘంటాపథంగా చెప్పారు. అయితే మోడీ పాలన ఆహో ఓహో అంటూ పొగడ్తలకు పడిపోకుండా ఏం జరగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదని సొంత పార్టీ నేతలు అంటున్నారు. కమలదళానికి భారీ విజయాన్ని సాధించి పెట్టిన ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా పాలన సాగిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీ నవభారతాన్ని ఆవిష్కరిస్తామని, పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు చేస్తామని అంటున్న మాటలు నిజం అయ్యాయా లేదా అన్నది మననం చేసుకోవాల్ని విశ్లేషకులు అంటున్నారు. 125 కోట్ల మంది ప్రజలను కలుపుకొని నవ భారత్‌ రూపకల్పనకు ముందుకు కదలాలి. 2022 నాటికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లవుతున్న సందర్భంగా దేశాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లే సంకల్పంతో ముందుకెళ్లాలన్న సంకల్పానికి కార్యాచరణ ఉండాలి. ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఇప్పటికైనా గమనించాలి. లోపాలుంటే సరిదిద్దుకొని ముందడుగు వేస్తామని సంకల్పం ప్రకటించాలి. అప్పుడే దానికి సార్థకత ఉంటుంది. అయితే ఇవన్నీ మోడీ చెప్పివే. కాంగ్రెస్‌కన్నా భిన్నంగా పాలన సాగడంతో పాటు, పాలనలో విప్లవాత్మక ధోరణులు రావాలి. వివిధ రంగాల్లో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. మంత్రులు తమతమ శాఖల వారీగా ప్రగతి నివేదికల్ని విడుదల చేయబోతున్నారు. ఈ దశలో అసలు ఏం జరగుతుందో గమనించాలి. 2014లో అధికారంలోకి వచ్చిన నాటికి ధరలు ఎలా ఉన్నాయో బేరీజు వేసుకోవాలి. ద్రవ్యోల్బణం పెరిగిందా లేదా తెలియచేయాలి. శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయా అన్నది చూడాలి. డాలర్‌ రేటు ఎందుకు పెరిగిందన్నది చూడాలి. విదేశాల్లో దాగిన నల్లధనం వెలికితెస్తామన్న హావిూ ఏమయ్యింది. గోడౌన్లలో మగ్గిపోతున్న ధాన్యం పుచ్చి పోకుండా ప్రజలకు పంచుతామన్న హావిూ ఏమయ్యింది. ఇలా చెప్పుకుంటూ పోతే వైఫల్యాల జాబితా చాంతాడంత ఉంటుంది. ఇప్పటికైనా ప్రధాని మోడీ ప్రజల సమస్యలను తెలుసుకుని ముందుకు సాగాల్సి ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.