అంధకారంలోకి ఆంధ్రప్రదేశ్‌


ప్రభుత్వంపై చింతామోహన్‌ విమర్శలు

గుంటూరు,అక్టోబర్‌11  (జనం సాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ అంధకారంలోకి వెళ్లిందని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్‌ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వచ్చే నెలలో అసలు రాష్ట్రంలో కరెంట్‌ కూడా ఉండదన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అదానీ ప్రదేశ్‌గా మారిందని విమర్శించారు. ప్రతి ఆదివారం అదానీ తాడేపల్లి వచ్చి వెళ్తుంటారన్నారు. సీఎం జగన్‌ నవరత్నాలతో ప్రజల నవ రంధ్రాలు మూసి వేశారన్నారు. అసలు నవరత్నాలు రాజ్యాంగ విరుద్ధమన్నారు. రాష్ట్రంలో 80 లక్షల మంది విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు ఆగిపోయా యన్నారు. రైతు ఆత్మహత్యలతో పాటు విద్యార్థుల ఆత్మహత్యలు కూడా ప్రారంభమయ్యే పరిస్థితి ఉందన్నారు. నవంబర్‌ 1వ తేదీలోపు ప్రభుత్వం విద్యార్థుల స్కాలర్‌ షిప్‌లు చెల్లించాలని చింతా మోహన్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ్గªనాన్స్‌ కార్పొరేషన్‌ తెరవాలన్నారు. విశాఖ ప్రజలు రాజధాని అడగలేదని, స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ కాకుండా ఉండాలని కొరకుకుంటున్నారన్నారు. జగన్‌ రెడ్డిది డిల్లీలో ఓ మాట.. గల్లీలో మరో మాట మాట్లాడతారని విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తొలిరోజే స్టీల్‌ ఎª`లాంట్‌ను ప్రైవేటీకరణ నుంచి విముక్తి కలిగిస్తామని చింతా మోహన్‌ అన్నారు.