హైదరాబాద్ : నగరంలో శనివారం పలు చోట్ల కుండపోత వర్షం కురిసింది. దిల్‌సుఖ్‌నగర్, సరూర్‌నగర్, కుషాయిగూడ, చెంగిచెర్ల, ఉప్పల్, రాంనగర్, సికింద్రాబాద్, ముషిరాబాద్, ఖైరతాబాద్, పంజాగుట్ట, లక్డీకాపూల్, చంపాపేట, సైదాబాద్, చైతన్యపురి పాటు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వానపడింది.
ఒక్కసారిగా వర్షం కురవడంతో రోడ్లపైకి నీరు చేరింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇదిలా ఉండగా.. నగరంలో ఇవాళ మధ్యాహ్నం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ సైతం అప్రమత్తమైంది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల ప్రజలకు సహాయం అందించేందుకు సైతం జీహెచ్‌ఎంసీ కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది. అత్యవసరమైతే 040 2111 1111 నంబరులో సంప్రదించాలని సూచించింది.