ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మ


 సంగారెడ్డి,అక్టోబర్‌9 (జనంసాక్షి):  ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు ఓ మహిళ జన్మనిచ్చింది. సదాశివపేట మండలం కంబాలపల్లిలో ఈ అరుదైన సంఘటన జరిగింది. బాలమణి అనే మహళ సంగారెడ్డి ప్రైవేట్‌ హస్పిటల్‌?లో శనివారం ప్రసవించింది. మహిళ ఒక ఆడ, ముగ్గురు మగ బిడ్డలకు జన్మనిచింది. అయితే..తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.