ఆ 12మంది క్షమాపణలు చెప్పాల్సిందే

న్యూఢల్లీి,నవంబర్‌30(జనం సాక్షి): రాజ్యసభలో గందరగోళం సృష్టించారనే కారణంగా బహిష్కరణకు గురయిన ప్రతిపక్ష పార్టీకలకు చెందిన 12 మంది ఎంపీలు క్షమాపణలు చెప్పల్సిందే అని కేంద్రమంత్రులు డిమాండ్‌ చేశారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల తొలిరోజునే వీరిని సస్పెండ్‌ చేశారు. అయితే సస్పెన్షన్‌కు గురైన 12 మంది ఎంపీలు పార్లమెంట్‌కు క్షమాపణలు చెప్పాలని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. గత సభలో మహిళా మార్షల్స్‌ విూద దాడికి పాల్పడ్డారని, వెల్‌లోకి ప్రవేశించి సభా కార్యకలాపాలు కొనసాగకుండా అడ్డుకున్నారని పీయూష్‌ అన్నారు. వర్షాకాల సమావేశాల చివరిరోజున సస్పెన్షన్‌కు గురైన 12 మంది ఎంపీలు ప్రవర్తన నాకింకా గుర్తుంది. ఆ సమయంలో కొంత మంది ఎంపీలు మహిళా మార్షల్స్‌పై కొంత మంది ఎంపీలు పురుష మార్షల్స్‌పై దాడికి దిగారు. సభలో ఏం జరుగుతుందో కూడా అర్థం కాని స్థాయిలో ప్రవర్తించారు. దీనిపై ఒక కమిటీ వేశాం. ఇందులో ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు కూడా ఉన్నారు. సభలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయో కమిటీయే నిర్దారిస్తుందనిని మంగళవారం పీయూష్‌ అన్నారు.