ఏపీలో కొత్తగా 184 మందికి కరోనా

అమరావతి,నవంబర్‌30(జనం సాక్షి):  ఏపీలో కొత్తగా 184 మంది కరోనా బారిన పడ్డారు. చికిత్స పొందుతూ చిత్తూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఒక్కొక్కరు మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 25, 925 మంది నుంచి నమూనాలు పరీక్షించగా 184 మందికి కొవిడ్‌ సోకిందని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు హెల్త్‌ బులిటిన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,149 కరోనా యాక్టివ్‌ కేసులు ఉండగా 134 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారని తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3కోట్ల 4లక్షల 17వేల మంది నుంచి సాంపిల్స్‌ను పరీక్షించినట్లు తెలిపారు. చిత్తూరులో 30 మంది, కృష్ణాలో 34 ,ఈస్ట్‌గోదావరిలో 17, గుంటూరులో 15 మంది, శ్రీకాకుళంలో 10, విశాఖపట్నంలో 26, వెస్ట్‌ గోదావరిలో 21 మంది కొవిడ్‌ బారిన పడ్డారు.