` అందజేసిన రాష్ట్రపతి
న్యూఢల్లీి,నవంబరు 20(జనంసాక్షి):దేశంలో స్వచ్ఛ నగరంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు తొలి ర్యాంక్ దక్కింది. ఆ నగరానికి మొదటి ర్యాంక్ దక్కడం ఇది అయిదోసారి. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇవాళ ఆ నగరానికి స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డును ప్రదానం చేశారు. స్వచ్ఛ నగరాల్లో గుజరాత్‌లోని సూరత్, ఏపీలోని విజయవాడలు రెండు, మూడవ స్థానాల్లో నిలిచాయి. ఆ అవార్డులను కూడా రాష్ట్రపతి వారికి అందజేశారు. క్లీనెస్ట్ సిటీ అవార్డులను కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ వెల్లడిరచింది. క్లీనెస్ట్ గంగా టౌన్‌గా వారణాసికి అవార్డు దక్కింది. అతి పరిశుభ్రమైన రాష్ట్రంగా చత్తీస్ఘడ్ నిలిచింది. విజేతలందరికీ రామ్‌నాథ్ కోవింద్ ఇవాళ పురస్కారాలను అందజేశారు.
ఇండోర్‌కు ఐదోసారి స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు