అంకుర పరిశ్రమల అభివృద్దికి చర్య తీసుకోవాలి
లోక్‌సభలో చేవెళ్ల ఎంపి రంజిత్ రెడ్డి
న్యూఢల్లీి,నవంబర్29(జనం సాక్షి): తెలంగాణలో రైతులు పండిరచిన ధాన్యం, బియ్యం కొనుగోలు విషయమై స్పష్టత ఇవ్వాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కోరారు. భారత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా సోమవారం లోక్ సభలో చేవెళ్ళ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి 377 నిబంధన ప్రకారం ఈ విషయం పై ప్రధానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సీఎం కేసిఆర్ రైతు ఫ్రెండ్లీ పరిపాలన చేస్తున్నారన్నారు. కేసిఆర్ దార్శనికత వల్ల సమృద్ధిగా నీరు, 24 గంటల ఉచిత విద్యుత్, రైతులకు పంటల పెట్టుబడి కింద రైతు బంధు, అందుబాటులో ఎరువులు, విత్తనాలు ఉన్నాయన్నారు. ఈ కారణంగా ప్రతి ఏడాది రాష్ట్రంలో పంటలు అధికంగా పండుతున్నాయి. దిగుబడులు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, ప్రతి ఏడాది ఎఫ్.సి.ఐ కొనుగోలు చేసే బియ్యం లక్ష్యాన్ని ఒకేసారి నిర్ణయించే విధంగా ఆదేశించాలని ప్రధానిని ఎంపీ రంజిత్ రెడ్డి కోరారు. అలాగే, ప్రతి ఏటా పెరుగుతున్న దిగుబడులను అనుసరించి, ఎఫ్ సి. ఐ కొనుగోలు ను కూడా పెంచాలి. ఎదుగుతున్న తెలంగాణ వంటి రాష్టాల్రకు కేంద్రం సహకారంగా ఉండాలని, ఏవిధంగా ఎఫ్.సి.ఐ ని ఆదేశించాలని ఎంపీ రంజిత్ రెడ్డి ప్రధాని మోడీని కోరారు. అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలను, అంకురాలను దేశంలో అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటని సంబంధిత శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ని చేవెళ్ల లోకసభ ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ తీసుకుంటున్న చర్యలను సభ దృష్టి కి తీసుకెళ్లారు. టీ హబ్, అంతర్జాతీయ ఐటీ కంపెనీలు తెలంగాణకు రావడానికి తీసుకుంటున్న ప్రోత్సాహకాలను వివరించారు. రంజిత్ రెడ్డి ప్రశ్నకు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానమిస్తూ, 2021 జూన్ 29 న నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ స్టీరింగ్ కమిటీ సమావేశమై తన 2వ సమావేశంలో ఈ విషయమై చర్చించి పలు మార్గదర్శకాలు ఇస్తూ సూచనలు చేసిందన్నారు. ªూటిని అనుసరించి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. కచ్చితంగా అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లుగా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి ఎంపీ రంజిత్ రెడ్డి కి కేంద్ర మంత్రి వివరించారు.