మరో ఇద్దరి పరిస్థితి విషమం
హైదరాబాద్,నవంబర్ 23 (జనంసాక్షి): నానక్‌రామ్‌గూడలోని ఓ నివాస సముదాయంలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ పేలుడు ధాటికి భవనం ధ్వంసం కాగా, ఒకరు మృతి చెందారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గ్యాస్ సిలిండర్ పేలుడు శబ్దం విని స్థానికులు ఉలిక్కిపడ్డారు. బాంబు పేలిందనుకుని భయపడ్డారు.