ప్రభుత్వ పథకాలపై అపోహలోద్దు

  

కాకినాడ, నవంబర్‌30(జనం సాక్షి) : ఆలమూరు :ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి పేదల కోసం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలపై అపోహలకు పోవద్దని ప్రభుత్వ విప్‌ చిర్ల జగ్గిరెడ్డి, జెడ్పీ సీఈవో ఎన్‌.వి.వి.సత్యనారాయణ పేర్కొన్నారు. లంక గ్రామాల ముఖ్య కేంద్రమైన చెముడులంక కమ్యూనిటీ హాల్లో ఎంపీపీ తోరాటి లక్ష్మణరావు అధ్యక్షతన ప్రభుత్వ పథకాల వినియోగంపై మంగళవారం విస్తఅతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా పాల్గని వారు మాట్లాడుతూ సంక్షేమ పథకాల వినియోగంలో అర్హులైన వారిని గుర్తించి లబ్దిదారులను చేయాలని అధికారులకు సూచించారు. వన్‌ టైం సెటిల్మెంట్‌(ఓటీఎస్‌) ద్వారా జగనన్న శాశ్వత గఅహ హక్కు పథకానికి అర్హులను చేరువ చేయాలని సచివాలయ ఉద్యోగులను వాలంటీర్లకు సూచించారు. పాత బకాయిలు ప్రస్తుతం నిర్ణయించిన దాని కంటే తక్కువ ఉంటే అవే చెల్లించుకుని రుణ విముక్తి పొందాలని లబ్దిదారులకు సూచించారు. అలాగే వైసిపి ప్రభుత్వ హయాంలో పలు సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి జగన్‌ ప్రవేశపెట్టి అమలు చేస్తున్న తీరు అమోఘమని ప్రభుత్వ విప్‌ కొనియాడారు. అనంతరం పలువురు ముందుకు వచ్చి ఓటిఎస్‌ కు సంబంధించి రుణాలు చెల్లించి వాటి విముక్తి పత్రాలను పొందగా, అలాగే జగనన్న విద్య దీవెన క్రింద పలువురు లబ్దిదారులకు చెక్కులను వారు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్‌, సర్పంచ్‌ తమ్మన శ్రీనివాస్‌, వ్యవసాయ సలహామండలి కమిటీ అధ్యక్షుడు యనమదల నాగేశ్వరావు, ఏడిఏ సిహెచ్‌.కె.వి.చౌదరి, ఎంపీడీవో జె.ఏ.రaాన్సీ, తాహసిల్దార్‌ జి.లక్ష్మీపతి, హౌసింగ్‌ ఏఈ జేజిబాబు, వెలుగు ఏపీఎం విశ్వనాథం, మాజీ ఎంపీపీ తోరాటి రాంబాబు, వైసీపీ నేతలు దొండపాటి వెంకటేశ్వరరావు, అడబాల వీర్రాజు, దొండపాటి చంటి, దొండపాటి వెంకట్రామయ్య, దంగేటి బాపనయ్య, సుంకర శ్రీనివాస్‌, అడబాల శ్రీనివాస్‌, మోటూరి సురేష్‌, తమ్మన హరి, రాయుడు వెంకటేష్‌, బి.వీర వెంకటరావు, బర్రా వీరబాబు, నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.