`కెసిఆర్‌ దోపిడీకి బలవుతున్న రైతులుధాన్యం

  

కొనుగోళ్లపై మోసపూరిత ప్రకటనలుమండిపడ్డ ఎంపి ధర్మిపురి అర్వింద్‌

న్యూఢల్లీి,నవంబర్‌30(జనం సాక్షి):  కేసీఆర్‌ మింగుడుకు రైతులు బలి అవుతున్నారని ఎంపీ అర్వింద్‌ వ్యాఖ్యానించారు. ధాన్యం కొనబోమని కేంద్రంపై నెపం పెట్టడంలో అర్థం లేదన్నారు. మంగళవారం ఢల్లీిలో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్రంపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. గత నాలుగేళ్లుగా బాయిల్డ్‌ రైస్‌ తగ్గించుకోమని కేంద్రం చెబుతూనే ఉందన్నారు. రీసైకిలింగ్‌ బియ్యాన్ని టీఆర్‌ఎస్‌ నేతలు ఎఫ్‌సీఐకి అమ్ముతున్నారని తెలిపారు. కర్ణాటక నుంచి తక్కువ నాణ్యత గల బియ్యాన్ని తీసుకొచ్చి.. స్మగ్లింగ్‌కు పాల్పడుతూ వేల కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌.. ముఖ్యమంత్రి మాస్క్‌ వేసుకున్న స్మగ్లర్‌ అని ఎంపీ దుయ్యబట్టారు. కిషన్‌రెడ్డి, పియూష్‌గోయల్‌పై కేసీఆర్‌ వాడిన భాష సరికాదన్నారు. తెలంగాణలో భూముల ధరలు పెరగడంలో కేసీఆర్‌ గొప్పతనం లేదని... అలాంటప్పుడు ప్రభుత్వ భూములు ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నించారు. కేసీఆర్‌ ప్రెస్‌ విూట్‌ చూస్తే చెవులు మూసుకోవాల్సి వస్తుందన్నారు. రైతులు పండిరచిన పంటలపై కూడా కేసీఆర్‌ స్మగ్లింగ్‌ చేస్తున్నారని ఎంపీ అర్వింద్‌ ఆరోపించారు.