సిరివెన్నెల మృతి సాహిత్యరంగానికి తీరనిలోటు : మంత్రులు

హైదరాబాద్‌,నవంబర్‌30(జనం సాక్షి): నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని అంటూ ప్రశ్నించిన గొంతు మూగపోయిందని సినీ గేయ రచయత సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్తమయం పట్ల మంత్రులు హరీశ్‌రావు, సత్యవతి రాథోడ్‌, జగదీష్‌రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు సంతాపం తెలిపారు. సీతారామ శాస్త్రి సాహిత్య రంగానికి చేసిన సేవ మరచిపోలేనిదని, ఆయన లేని లోటు పూడ్చలేనిదన్నారు. భౌతికంగా మరణించినా..ఆయన పాటలతో చిరకాలం చిరంజీవిలా బ్రతికే ఉంటారన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. అలాగే సిరివెన్నెల మృతి పట్ల చేవెళ్ల లోక్‌సభ ఎంపీ డా.జి రంజిత్‌ రెడ్డి సంతాపం తెలిపారు.వారు రాసిన పాటలు చాలా మంది నిజ జీవితాల్లో గుణపాఠాలు అయి ఎందరికో జీవితాన్ని ఇచ్చారని అన్నారు.